మనం ఒక పెద్ద డబ్బాలో గోలీలు, చాక్లెట్లు, లాలీపప్‌లు, క్యాండీలను వేస్తే.. అవన్నీ ఆ డబ్బాలో పడతాయి. అలా కాకుండా.. చాక్లెట్లు మాత్రమే పడి, మిగతావి పడకపోతే, ఎందుకు పడట్లేదని మనం ఆలోచిస్తాం. ఇదే ప్రశ్నను మనం ఆక్సిజన్ విషయంలో కూడా వేసుకోవాలి. ఎందుకంటే.. మనం గాలిని ముక్కు ద్వారా పీల్చినప్పుడు.. ఆక్సిజన్‌తోపాటూ, నైట్రోజన్, ఇతర వాయువులు కూడా ఉంటాయి. కానీ, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మాత్రమే రక్తంలో కలుస్తుంది. మిగతావి కలవవు. ఎందుకు అనేదే ప్రశ్న. వివరంగా తెలుసుకుందాం.
గాలిలో ఏముంటాయి?
పై ప్రశ్నకు సమాధానం వెతికే ముందు.. అసలు గాలిలో ఏమేం ఉంటాయో మనకు తెలియాలి. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ ప్రధానంగా ఉంటాయి. గాలిలో నైట్రోజన్ 80 శాతం ఉంటుంది. ఆక్సిజన్ 20 శాతం ఉంటుంది. కానీ 80 శాతం ఉన్న నైట్రోజన్ తిరిగి బయటకు వచ్చేస్తుంది. 20 శాతం ఉన్న ఆక్సిజన్ మాత్రం రక్తంలో కలుస్తుంది.
ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుంది?
మీరు స్టడీ బుక్స్‌లో చదివే ఉంటారు. ఉపిరితిత్తులు (Lungs) స్పాంజీలలాగా ఉంటాయి. వాటిలోకి గాలి వెళ్తుంది. అక్కడ పలుచని చర్మంతో రక్తనాళాలు ఉంటాయి. వాటిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రక్తంలో హిమోగ్లోబిన్ (hemoglobin) ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్‌కి మాగ్నెటిక్ తరహా పవర్ (అయస్కాంత ధర్మం) ఉంటుంది. ఇదే పవర్ ఆక్సిజన్‌కి కూడా ఉంటుంది. దాంతో హిమోగ్లోబిన్ ఆకర్షించగానే, ఆక్సిజన్ ఆకర్షణ చెందుతుంది. దాంతో అది రక్తంలో కలుస్తుంది.
నైట్రోజన్‌కి మాగ్నెటిక్ తరహా పవర్ లేదు. అందువల్ల అది రక్తంలో కలవదు. ఐతే.. నైట్రోజన్‌తో మనకు ప్రత్యేక అవసరం ఉంటుంది. ఈ నైట్రోజన్ 80 శాతం ఉండటం వల్ల ఇది పీడనం కలిగిస్తూ, ఆక్సిజన్‌ను అన్ని మూలలకూ నెడుతుంది. అలా నెట్టడం వల్లే ఆక్సిజన్, రక్తనాళాల దగ్గరి దాకా వెళ్తుంది. అదే నైట్రోజన్ లేకపోతే, ఆక్సిజన్ అంత మూలల్లోకి వెళ్లదు. ఇలా మనం పీల్చే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ రెండూ కీలకమైనవే. దేని పని అవి చేస్తాయి.
రక్తంలో కలిసే ఆక్సిజన్.. శరీరంలోని ప్రతీ కణానికీ చేరుతుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. శ్వాస సమస్యలు ఉండేవారు.. రక్తాన్ని పెంచుకోవాలి. అంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేలా చేసుకోవాలి. అందుకోసం వారు.. బంగాళాదుంపలు, బీట్‌రూట్, ఆకుకూరలు, ఖర్జూరాలు, ద్రాక్ష, కిస్‌మిస్, నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, దానిమ్మ, ఆరెంజ్ వంటి పుల్లటి పండ్లు తినాలి. టీ, కాఫీలు, కూల్‌డ్రింక్స్ వంటివి తగ్గించుకోవాలి.
(Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)

No comments:
Post a Comment