| Rose petal jam (image credit - x - @ayush_mp) |
గులాబీలు మనందరికీ నచ్చుతాయి. రంగురంగుల ఈ పూలను బ్రిటీష్ వారు ఇండియాకి తెచ్చారు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ పులు ఉన్నాయి. గులాబీలతో రకరకాల సెంట్లు తయారుచేస్తారు. కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కూడా గులాబీలను వాడుతారు. గులాబీ రేకలతో తయారుచేసే జామ్, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్నే రోజ్ పెటల్ జామ్ లేదా గుల్కండ్ అని కూడా అంటారు.
ప్రయోజనాలు:
చర్మ సంబంధిత సమస్యలను నివారించి ముఖాన్ని ఎంతో ఆకర్షణీయంగా చేస్తుంది ఈ జామ్. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరానికి తగినంత ఐరన్, ప్రోటీన్లను సమకూరుస్తుంది. గట్ ఫ్లోరా, పేగు సంబంధిత సమస్యలకు ఈ జామ్ సరైన నివారణ. హైపర్ ఏసీడీటీ (Acidity), నోటి పూతలు, గర్భిణీ స్త్రీలకు ఇది మేలు చేస్తుంది. అలాగే పిల్లల్లో మలబద్ధక సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. మొటిమలు, మచ్చలు లాంటి చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. ఈ జామ్ తిన్న వారికి నిద్ర బాగా పడుతుంది. మూత్రం చక్కగా వచ్చేలా సాయపడటమే కాకుండా, ఎడెమా రోగులకు ఇది సరిగ్గా పనిచేస్తుంది. ఈ జామ్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
గులాబీ రేకలు 250 గ్రాములు
పంచదార 250 గ్రాములు
తయారీ విధానం:
తాజా గులాబీ రేకలను పువ్వుల నుంచి వేరు చేసి, బాగా కడగాలి. తర్వాత అవి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టాలి. తర్వాత వాటిని పొడిలాగా, చూర్ణంలాగా చేయవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని పంచదార కలపాలి. తర్వాత గాలి చేరని సీసాలో వేసి 2 నుంచి 3 వారాల పాటు సూర్యకాంతి తగిలేలా ఉంచాలి. శుభ్రమైన పొడి చెంచాతో ప్రతిరోజు ఆ మిశ్రాన్ని కదిలించాలి. మూడు వారాల తర్వాత, దాన్ని వాడుకోవచ్చు. జామ్ లాగా రోజూ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గుల్కండ్‌ను తినవచ్చు. చక్కెర ఉంటుంది కాబట్టి ఇది తియ్యగా, చిక్కని జ్యూస్‌లా ఉంటుంది. దీని ప్రయోజనాలు వాడిన రోజు నుంచే కనిపిస్తాయి.
(గమనిక: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి)
No comments:
Post a Comment