Saturday, February 10, 2024

నోరూరించే చికెన్ రసం రెసిపీ. ఇలా తయారుచేసుకోండి

Chicken Recipe (image credit - x - @yindian5)

రుచికరమైన చికెన్ కర్రీ వండుకొని తినడం ఓ ఆర్ట్. చికెన్‌ని మనం వంద రకాలుగా వండుకోవచ్చు. ఈ కర్రీ తినడం వల్ల ఎనర్జీ పెరగడమే కాదు.. ఆరోగ్యకరం కూడా. ముఖ్యంగా ప్రోటీన్ సమస్యతో బాధపడేవారు చికెన్ కర్రీ తింటే, సమృద్ధిగా ప్రోటీన్స్ లభిస్తాయి. ఇవి వ్యాధులతో పోరాడటంలో ఎంతో బాగా పనిచేస్తాయి. అందుకే డాక్టర్లు వారానికి రెండుసార్లైనా చికెన్ తినమని చెబుతుంటారు. మరి చికెన్ కర్రీని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని, మరో 20 నిమిషాల్లో వండుకోవడానికి.. చికెన్ రసం రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తమిళనాడులోని చెట్టినాడులో ఫేమస్. సంప్రదాయబద్ధమైన రసంతో ఈ కర్రీ చేస్తారు. ఇదో మంచి సూప్‌లా ఉంటుంది. ఎంతో స్పైసీగా ఉన్నా, కడుపులో ఎలాంటి సమస్యలూ రావు.


చికెన్ రసం పొడి కోసం కావాల్సినవి:

1 టీస్పూన్ నెయ్యి

1 టీస్పూన్ నల్ల మిరియాలు

1 టీస్పూన్ ధనియాలు

1 టీస్పూన్ జీలకర్ర

1 టీస్పూన్ సోంపు

5-6 ఎండిమిర్చి


చికెన్ రసం రెసిపీ కోసం కావాల్సినవి:

350 గ్రాముల చికెన్ బోన్స్ (కొద్దిగా మాంసం ఉండాలి)

1 టీస్పూన్ పసుపు

1 టీస్పూన్ ఉప్పు

1న్నర లీటర్ల నీరు


ట్యాంపరింగ్ కోసం కావాల్సినవి:

1 టీస్పూన్ నెయ్యి

1 టీస్పూన్ జీలకర్ర

2 రెబ్బల కరివేపాకులు

1 మీడియం సైజు ఉల్లిపాయ (చిన్నగా కట్ చేసుకోవాలి)

1 మీడియం సైజు టమాట (చిన్నగా కట్ చేసుకోవాలి)

1 టీస్పూన్ ఉప్పు


చికెన్ రసం తయారీ విధానం:

రసం పొడి కోసం, కావాల్సిన వాటిని ముందుగా 1 టీస్పూన్ నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తూ, సువాసన వస్తున్నంత వరకూ వేపుకోవాలి. తర్వాత అదంతా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యమధ్యలో కదుపుతూ, గ్రైండ్ చేస్తే ఎక్కువ మెత్తగా అవుతుంది.


ఇప్పుడు చికెన్ ఎముకలకు పసుపు రాసి, ఉప్పు వేసి, నీటిలో ఉంచి, 10 నిమిషాలపాటూ, ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. తర్వాత మంట ఆర్పి, కుక్కర్ రిలీజ్ చెయ్యాలి.


ఇప్పుడు నీటిని వేరు చేసి, చికెన్ ఎముకల నుంచి చికెన్‌ను వేరు చెయ్యాలి. రెండింటినీ వేరువేరుగా ఉంచాలి.


ప్యాన్‌లో నెయ్యి వేసి, జీలకర్ర, కరివేపాకుల్ని వేపాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చెయ్యాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి, ఉప్పు వెయ్యాలి. టమాటా ముక్కలు ఉడికే వరకూ ఉంచాలి. ఇప్పుడు రసం పౌడర్ వెయ్యాలి. కొన్ని నిమిషాలవరకూ తిప్పుతూ, కదుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్‌ను వేసి. బాగా కలపాలి. ఇప్పుడు పైన వేరు చేసిన నీటిని పోసి, ఐదు నిమిషాలవరకూ సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు చికెన్ రసం రెసిపీ రెడీ. వేడి వేడి సూప్‌లా సెర్వ్ చేయవచ్చు.

No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...