Saturday, February 10, 2024

చికెన్ గ్రేవీ రెసిపీ.. ఇలా చేశారంటే.. చిటుక్కున అయిపోతుంది

chicken recipe

చికెన్‌లో ప్రోటీన్స్ ఉంటాయి. అవి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఐతే ఎప్పుడూ రొటీన్‌గా చికెన్ కర్రీయో, ఫ్రై చికెనో వండుకుంటే రొటీన్ టేస్ట్ అవుతుంది. కాస్త కొత్తగా ట్రై చేస్తే, అదిరిపోయే కొత్త టేస్ట్ చూడవచ్చు. ప్లస్ మనకు ఓ కొత్త వంట చేయడం కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్లకు అలా చేసి పెడితే, వావ్ సూపర్ అంటూ లొట్టలేసుకు తింటారు. అలాంటి ఓ చక్కటి, అదిరిపోయే గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాలు, వంట చేయడానికి 30 నిమిషాలు పడుతుంది.


చికెన్ గ్రేవీ కోసం కావాల్సినవి :

500 గ్రాముల చికెన్

4 టేబుల్ స్పూన్ల నూనె

1 టీస్పూన్ జీలకర్ర

1 దాల్చిన చెక్క ముక్క లేదా పొడి

2 యాలకులు

2 పెద్ద ఉల్లిపాయలు (ముక్కలు కోసి పెట్టుకోవాలి)

2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్

2 టమాటాలు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి

2 టీస్పూన్ల కారం

1 టీస్పూన్ జీర పొడి

1 టీస్పూన్ గరం మసాలా పౌడర్

ఉప్పు సరిపడా వేసుకోవాలి.


రోస్ట్ చేసి, గ్రైండ్ చేసుకోవాల్సినవి: (వీటిని పొడిలా చేసుకోవాలి)

1 టీస్పూన్ సోంపు

2 టీస్పూన్ల నల్ల మిరియాలు


చికెన్ గ్రేవీ తయారీ విధానం:

ముందుగా మిరియాలు, సోంపు గింజల్ని వేపాలి. అవి వేడి తగ్గాక, గ్రైండ్ చేసి, పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి వేడి చెయ్యాలి. అందులో దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు వెయ్యాలి. వేగనివ్వాలి. బుడగలు వస్తున్నప్పుడు, టప్ టప్ మని జీలకర్ర అంటున్నప్పుడు వెంటనే, ఉల్లిపాయలు వెయ్యాలి. బంగారు, గోధుమ రంగులోకి వచ్చే వరకు వేపాలి. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు టమాటాలు వేసి, అవి గుజ్జులా మారేవరకూ కదుపుతూ వేపుతూ ఉండాలి.


ఉప్పు, గరం మసాలా పౌడర్, ఇతరత్రా అన్నీ వేసేయాలి. ఐతే.. మిరియాల పొడి, సోంపు పొడి మాత్రం అప్పుడే వెయ్యకూడదు. ఇప్పుడు చికెన్ వేసి, బాగా కలపాలి. ప్రెషర్ కుక్కర్ మూసేసి, నాలుగైదు, విజిల్స్ వచ్చేవరకూ వండాలి. తర్వాత సిమ్‌లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత మంట ఆర్పేసి, ఆవిరి పోయేలా అలా వదిలేయాలి.


ఆవిరి పోయాక, కుక్కర్ తెరిచి, నీరు పొయ్యాలి. చికెన్ కావాల్సినంతగా ఉడికేలా చెయ్యాలి. ఇప్పుడు చివరలో మిరియాల పొడి, సోంపు పొడి వెయ్యాలి. ఇవి ఆప్షన్ మాత్రమే. వెయ్యకపోయినా పర్వాలేదు. వేస్తే మాత్రం బాగా కలిపి, వేడివేడిగా వడ్డించేయడమే.


ఈ గ్రేవీ చికెన్ కర్రీ, అన్నంతోపాటూ, రోటీ, పులావ్‌లోకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. నోరు ఊరుతూ ఉంటుంది. పుల్లపుల్లగా, స్పైసీగా భలే ఉందే అనిపిస్తుంది.

No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...