| Bharat Dal: రూ.60కే కేజీ పచ్చి శనగపప్పు |
Bharat Dal: మనం బయట పచ్చి శనగపప్పు కొంటే దాని ధర కేజీ రూ.100 నుంచి రూ.150 దాకా ఉంది. ఒక్కొక్కరూ ఒక్కో ధరకు అమ్ముతున్నారు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా ధర ఎక్కువగానే ఉంది. పైగా, ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు ఒక్కోసారి డెలివరీ ఛార్జీల కింద మరో రూ.40 తీసుకుంటూ ఉంటారు. అందువల్ల మనం తక్కువ ధరకు సరుకులు కొనాలంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది డీ-మార్ట్ స్టోర్ లాంటి వాటిలో కొంటుంటారు. ఐతే.. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ సగం ధరకే పప్పులను అమ్ముతోంది. వాటిని ఎలా కొనాలో తెలుసుకుందాం.
NAFED వంటి అధికారిక సైట్లలో కేంద్రం పప్పు దినుసుల్ని తక్కువ ధరకు అమ్ముతోంది. తాజాగా జియో మార్ట్, బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సైట్లలో కూడా తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇవి భారత్ దాల్, భారత్ రైస్ వంటి బ్రాండ్ నేమ్‌తో లభిస్తున్నాయి. కొన్ని సైట్లలో ఈ సరుకులు ఇప్పటికే ఉండగా, మరికొన్ని సైట్లు ఇప్పుడిప్పుడే వీటిని అమ్మడం మొదలుపెట్టాయి. మీకు తెలిసే ఉంటుంది. భారత్ రైస్ ఇప్పటికే రూ.29కి లభిస్తోంది. అలాగే మీరు పచ్చి శనగపప్పును కేజీ రూ.60కే కొనాలంటే, ఎలాగో చూద్దాం.
మీరు NAFED అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazaar.com/ లోకి వెళ్లండి. అక్కడ మీకు చాలా పప్పు దినుసులు తక్కువ ధరకే లభిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన వాటిని Add to Cart ద్వారా సెలెక్ట్ చేసుకొని.. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చి, మీ ఇంటి అడ్రెస్ ఇస్తే, డోర్ డెలివరీ అవుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎలా కొంటామో, ఇక్కడా అలాగే కొనుక్కోవచ్చు.
కొంతమంది నాఫెడ్ తమ ఏరియాలో డెలివరీ చెయ్యట్లేదని చెబుతున్నారు. అలాంటి వారు జియో మార్ట్, బిగ్ బాస్కెట్ వంటి సైట్లలో కొనుక్కోవాల్సి వస్తోంద. ఐతే, కేంద్రం త్వరలోనే దేశమంతా నాఫెడ్ సరుకులు అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలని ప్రయత్నిస్తోంది. అందువల్ల త్వరలోనే దేశ ప్రజలంతా తక్కువ ధరకే భారత్ రైస్, భారత్ పచ్చి శనగపప్పు, భారత్ మినప్పప్పు, భారత్ వేపినపప్పు వంటి చాలా పప్పులను కొనుక్కోగలరు.
No comments:
Post a Comment