తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తింపుకి సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఉప ముఖ్యమంత్రి, అర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతు భరోసా స్కీమ్‌ని బడ్జె్ట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటివరకూ రైతులకు మాత్రమే అమలులో వున్న రైతుబంధు పథకం బదులు, రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం వర్తింపజేసేలా డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ జారీ చేశారు.
రైతు భరోసా పథకం ప్రకారం రైతులు ఎకరాకి రూ.15000 పొందుతారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సంవత్సరంలో 3సార్లు రూ.5వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. లేదా రూ.7500 చొప్పున 2సార్లు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కౌలు రైతులు కూడా సంవత్సరానికి, ఎకరానికి రూ.15000 చొప్పున పొందుతారని ప్రభుత్వం తెలిపింది. అలాగే రైతు కూలీలు సంవత్సరానికి ఎకరాకి రూ.12000 చొప్పున పొందుతారు.
ఏయే పంటలకు వర్తిస్తుంది?
వరి, సోయాబీన్, బఠాణీలు, పత్తి, పచ్చిమిర్చి, మొక్కజొన్న, చెరకు ఇతర స్థానికంగా పండే పంటలకు రైతు భరోసా వర్తిస్తుంది.
రైతుబంధు లేదా రైతు భరోసా ఎలా పొందాలి?
రైతులు మండల రెవెన్యూ ఆఫీసర్ (MRO) లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. వారికి కింది పత్రాల జిరాక్స్ కాపీలు ఇవ్వాలి.
ఆధార్ కార్డు, భూమి హక్కు పత్రాలు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, అడ్రెస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం, బీపీఎల్ (దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు) సర్టిఫికెట్ (అవసరమైతే) ఇవ్వాలి. దీనిపై మరింత సమాచారం కోసం రైతులు హెల్ప్‌లైన్ నంబర్‌కి ఉచితంగా కాల్ చెయ్యవచ్చు. ఆ నంబర్ 040 2338 3520.
ఆన్‌లైన్‌లో
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుభరోసా, రైతుబీమా కోసం కొత్తగా https://rythubandhu.telangana.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ప్రారంభించింది. ఇందులో కూడా రైతులు తమ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇందుకోసం వారు ఈ లింక్ https://rythubandhu.telangana.gov.in/Default_RB1.aspx# లోకి వెళ్లాలి. అక్కడ వారికి cheque distribution venue schedule అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్లాలి. అప్పుడు.. జిల్లా, మండలం ఎంపిక చేసుకోవాలి. అప్పుడు వారి వివరాలు అక్కడ కనిపిస్తాయి. చెక్ ఎప్పుడు ఇచ్చేదీ తేదీలతో సహా వివరాలు లభిస్తాయి.
ఎప్పటి నుంచి అమలవుతుంది?
కౌలు రైతులకు రైతుబంధు, రైతు భరోసా పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. త్వరలోనే అంటోంది. అందువల్ల ఈలోగా రైతులు తమ పేర్లను నమోదు చేయించుకుంటే, పథకం అమల్లోకి రాగానే, ప్రయోజనం పొందవచ్చు.
No comments:
Post a Comment