Sunday, February 11, 2024

మొక్కజొన్న పీచును పారేయకండి.. ఇలా వాడుకోండి


 సాధారణంగా మనం మొక్కజొన్న తిని, దాని పొట్టును పారేస్తాం. మొక్కజొన్న గింజలను తీసి, పొట్టు పారేయడం మీరు గమనించి ఉండవచ్చు. ఈ పొట్టు మొక్కజొన్న గింజలపై రక్షణ కవచంలా ఉంటుంది. పై ఆకులు తొలగిస్తే, లోపల ఈ పొట్టు మెత్తగా ఉంటుంది. మనం చెత్త అనుకుంటూ పారేసే ఈ పీచులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కజొన్నలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మొక్కజొన్న పీచులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 


డయాబెటిస్‌తో బాధపడేవారికి మొక్కజొన్న పీచు మేలు చేస్తుంది. రక్తంలో షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. వారి రక్తంలో షుగల్ లెవెల్స్ సరి అవుతాయి. తద్వారా వారి ఆరోగ్యం మెరుగవుతుంది. అజీర్ణ సమస్యతో బాధపడే వారికి మొక్కజొన్న పీచుతో మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పీచులో ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మొక్కజొన్న పీచును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం తగ్గుతుంది. తద్వారా రక్త సరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండెకు రక్త ప్రసరణ బాగుంటుంది.


మొక్కజొన్న పీచు టీ:

మొక్కజొన్న పీచును మనం డైరెక్టుగా తినలేం. అలవాటు ఉండదు కదా.. తినబుద్ధి కాదు. అందువల్ల మనం టీ చేసుకొని తాగొచ్చు. ఎలాగంటే, మొక్కజొన్న పీచుని గ్లాసు నీటిలో వేసి, 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడగట్టి, ఆ నీటిలో నిమ్మరసం కలిపి, టీ లాగా తాగాలి. కావాలంటే కొద్దిగా పంచదార లేదా తేనె కూడా వేసుకోవచ్చు. ఈ టీని పిల్లలు, గ‌ర్భిణీలు, మందులు వాడే వారు తాగ‌కూడదు. 


(గమనిక: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి)

No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...