పథకం పేరు:
ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 1న ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు రకరకాల వృత్తులు చేపడుతూ, కేంద్రం నుంచి ఉచితంగా రూ.15,000 మనీ, అలాగే అవసరమైన రుణం కూడా తీసుకోవచ్చు. ఇలా ఇప్పటికే కేంద్రానికి కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. 4 లక్షల మందికి పైగా మనీ తీసుకున్నారు. మిగతా వారి అప్లికేషన్ల పరిశీలన జరుగుతూ ఉంది.
మనీ ఎవరికి ఇస్తారు?
కార్పెంటర్ (వడ్రంగి), పడవ తయారీదారు, బంగారు నగల తయారీదార్లు, నిర్మాణ కార్మికులు, లోహ కళాకారులు, సుత్తి తయారీదారు, టూల్ కిట్ల తయారీదారు, విగ్రహాల తయారీదారు, రాళ్లను పగలగొట్టేవారు, కుమ్మరివారు, చెప్పుల తయారీదారు, దుప్పట్లు, పరుపులు, చాపల తయారీదార్లు, బొమ్మల తయారీదార్లు, కొబ్బరిపీచుతో తాళ్లు చేసేవాళ్లు, బార్బర్, పూలదండల తయారీదార్లు, బట్టలు ఉతికేవారు, టైలర్లు, చేపల వలలు తయారుచేసే వారు, ఇతర వంటి వృత్తుల వారికి కేంద్రం ఈ డబ్బును ఇస్తుంది.
అర్హతలేంటి?
పైన చెప్పుకున్న వృత్తుల వారంతా అర్హులే. వారి వయస్సు 18 ఏళ్లు దాటి ఉండాలి. అప్లై చేసుకునేవారు ప్రస్తుతం ఆ పని చేస్తూ ఉండాలి. అలాగే వారు ఆ పని కోసం, గత ఐదేళ్లలో ఇలాంటి ఇతర పథకాల్లో రుణం తీసుకొని ఉండకూడదు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉండేవారు, వారి కుటుంబ సభ్యులూ ఈ పథకానికి అనర్హులు.
పథకం ప్రయోజనాలు:
ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారికి కేంద్రం విశ్వకర్మ సర్టిఫికెట్ ఇస్తుంది. ఐడీ కార్డు ఇస్తుంది. 40 గంటలపాటూ ఉచిత ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ 5 నుంచి 7 రోజులు ఉంటుంది. ఈ సమయంలో కేంద్రం స్టైపెండ్ కింద రోజూ రూ.500 చొప్పున ఇస్తుంది. ట్రైనింగ్ తర్వాత మీరు టూల్ కిట్ కొనుక్కోవడం కోసం మీకు రూ.15,000 ఇస్తుంది. అలాగే మీరు 18 నెలల్లో చెల్లించేలా రూ.1 లక్ష రుణం పొందవచ్చు. తర్వాత మరో 30 నెలల్లో చెల్లించేలా రూ.2లక్షల రుణం తీసుకోవచ్చు. ఈ రుణంపై కేంద్రం 5 శాతం వడ్డీ తీసుకుంటుంది. ఈ డబ్బుతో మీకు మీరే సొంతంగా షాపు పెట్టుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in/Login లోకి వెళ్లాలి. అక్కడ మొబైల్ నంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత ఆధార్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఓ రిజిస్ట్రేషన్ ఫారమ్ వస్తుంది. దాన్ని నింపి, సబ్‌మిట్ కొట్టాలి. తర్వాత మీకు డిజిటల్ రూపంలో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత మీరు రూ.15000 పొందడం, రుణం పొందడం వంటివి చేసుకోవచ్చు.

No comments:
Post a Comment