Monday, February 12, 2024

కొత్తిమీర, పుదీనా, కసూరి మేతితోపాటూ.. కిచెన్‌లో ఇది కూడా ఉంచుకోండి


Oregano Health Benefits: ఒరెగానో అనేది ఓ చిన్న సైజు మొక్క. ఇది ఎంత మంచిదంటే, దీనికి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. చక్కటి సువాసనతోపాటూ, రోగాల్ని నయం చేసే శక్తి దీని సొంతం. ఒరెగానోలో 40కి పైగా రకాలున్నాయి. వాటిలో ఒరిగానమ్ వల్గారే (Origanum vulgare) అత్యంత శక్తిమంతమైనది. పశ్చిమ ఆసియాలో పెరిగే ఈ మొక్క, తాజా ఆకులు లేదా ఎండిన ఆకుల్ని, చికెన్, మటన్, ఆకుకూరలు, అన్ని రకాల వంటల్లోనూ వాడితే, మంచి ఫ్లేవర్‌తోపాటూ, రోగాలకూ చెక్ పెట్టినట్లవుతుంది. ఇదే ఒరెగానో ఆకుల నుంచీ తైలం (నూనె లేదా ఆయిల్) కూడా తీస్తున్నారు. దాన్ని కూడా రకరకాల రోగాలు నయం చేసేందుకు వాడుతున్నారు. ఇప్పుడీ మొక్క కావాలంటే మనం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఈ మొక్కల ఎండిన ఆకులు, తైలాన్ని అమ్ముతున్నారు. 


ఒరెగానోతో ఆరోగ్య ప్రయోజనాలు

ఒరెగానో ఆకులు 23 రకాల చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి. కూరల్లో, ఫ్రైలలో ఈ ఆకుల్ని కొద్దిగా వేసుకుంటే చాలు, ఇవి శరీరంలో విష వ్యర్థాలను తరిమేస్తాయి. ఈ ఆకుల పొడిని పిజ్జాలపై కూడా చల్లుకుంటారు.


మన చర్మ కణాల్ని కాపాడే శక్తి ఈ ఆకులకు ఉంది. వీటిలో ఫైబర్, విటమిన్ K, మాంగనీస్, ఐరన్, విటమిన్ E, ట్రైప్టోఫాన్, కాల్షియం ఉన్నాయి. అందువల్ల ఇవి మనకు ఎంతో ఆరోగ్యకరం.


కాన్సర్, గుండె జబ్బుల అంతు చూసే ఈ ఆకుల వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువ.


ఎండిన ఆకుల్ని గాజు సీసాల్లో నిల్వ చేసుకోవాలి. కాలం గడిచే కొద్దీ సువాసన తగ్గినా, హెల్త్ పరంగా కలిగే ప్రయోజనాలు మాత్రం అలాగే ఉంటాయి.


గొంతు గరగరగా ఉన్నా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, వికారంగా ఉన్నా, ముక్కు దిబ్బడ ఉన్నా, గొంతు మంటగా ఉన్నా, ఒరెగానో ఆకుల్ని వాడతారు. త్వరగా ఫలితం కావాలంటే ఒరెగానో ఆయిల్‌ని కప్పు గోరు వెచ్చటి నీటిలో ఒకట్రెండు చుక్కలు వేసి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.


ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నచోట ఒరెగానో ఆయిల్ రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఒరెగానో ఆకులకు ఉంది.


బాడీలో వేడిని తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. బాడీలో వేడి పెరిగే కొద్దీ గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి ఇతర సమస్యలు వస్తాయి. అందువల్ల ఇలాంటి ఆకుల్ని కూరల్లో వేసేసుకుంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...