మనందరికీ రక్తం ఉంటుంది. అది ఎర్రగా ఉంటుంది. కానీ ఈ భూమిపై కొన్ని జీవులకు రక్తం ఎర్రగా ఉండదు. బొద్దింక, ఐస్ ఫిష్ వంటి వాటికి రక్తం తెల్లగా ఉంటుంది. మరి మనుషులకు ఎందుకు ఎర్రగా ఉంటుంది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు.
రక్తము ద్రవ రూపంలో ఉండే కణజాలముల సమూహం. ఇందులో ప్లాస్మా, ఇతర అనేకరకాల కణాలు ఉంటాయి. రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనేవి కీలకమైనవి. వీటిలో ఎర్ర రంగులో ఉండే రక్త కణాలు ఒక మనిషి రక్తంలోని ప్రతి చుక్కలో 30 కోట్ల వరకూ ఉంటాయి. ఈ రక్త కణాలలో "హిమోగ్లోబిన్" అనే ఎరుపు రంగు పదార్థం ఉంటుంది. అందువల్లే రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది.
ఎర్ర రక్త కణాలు, మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ని తమలో నింపుకుంటాయి. ఈ కణాలు శరీరంలోని అన్ని భాగాలకూ చేరేలా ఐరన్ ప్రోత్సహిస్తుంది. దాంతో ఎర్ర రక్త కణాలు, శరీరంలోని అన్ని భాగాలకూ చేరతాయి. దాంతో ఈ కణాల నుంచి ఆక్సిజన్.. శరీరం మొత్తానికీ చేరుతుంది.
వెన్నెముక లేని జీవులలో రక్తం ఎర్రగా ఉండదు. నీలి (blue), తెలుపు రంగులో ఉంటుంది. కారణం ఆ జీవుల రక్తంలో ఉండే పదార్థం ఎరుపు కాకుండా వేరే రంగులో ఉండటమే. హిమోగ్లోబిన్ ఉన్న రక్తం మాత్రమే ఎర్రగా ఉంటుంది. నీలి, తెలుపు రంగు రక్తం ఉండే జీవులలో హిమోగ్లోబిన్ ఉండదు.

No comments:
Post a Comment