మన ఇళ్లలో కూరలు వండేటప్పుడు, నూనె వేగిన తర్వాత, ఉల్లిపాయ ముక్కల్ని వేపుతారు. తర్వాత టమాటా ముక్కలు వేసినప్పుడు, ఉప్పు కూడా వేస్తారు. తద్వారా టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతాయని అంటారు. ఇదే ఫార్ములా పప్పు విషయంలో రివర్సులో ఉంటుంది. పప్పులను ఉడికించేప్పుడు మొదట్లోనే ఉప్పు వెయ్యరు. అలా వేస్తే పప్పు త్వరగా ఉడకదు అంటారు. ఉప్పు వేస్తే, పప్పు ఎందుకు ఉడకదు అనే ప్రశ్న మీకు ఎదురయ్యే ఉంటుంది.
సమాధానం ఇదే:
పప్పులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే పిండి పదార్థం. అలాగే మాంసకృత్తులు కూడా ఉంటాయి. అంటే ప్రోటీన్లు. అందువల్ల కందిపప్పు లాంటి వాటిని నీటిలో ఉడికించేటప్పుడు వాటిలోని పిండిపదార్థం త్వరగానే ఉడుకుతుంది. కానీ మాంసకృత్తులు మాత్రం త్వరగా ఉడకవు.
ఉడకడం అంటే ఏంటి?
ఇక్కడ మనం ఉడకడం అంటే ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాలి. ఉడకడం అంటే పొడవైన ప్రోటీను అణువులు చిన్న చిన్న ముక్కలుగా అవ్వడమే. ఇవి ముక్కలైనప్పుడు మన కడుపులో సులభంగా అరిగిపోతాయి. ఇలా ఇవి ముక్కలవ్వడం అనేది, నీటి వల్ల వీలవుతుంది. ఇలా ప్రోటీన్ అణువులు ముక్కలవడాన్ని జలవిశ్లేషణం (hydrolysis) అంటారు.
ఉప్పు వేస్తే ఏమవుతుంది?
మీరు పప్పును ఉడికించేటప్పుడు, నీటిలో ఉప్పు వేస్తే, ప్రోటీన్లు త్వరగా ముక్కలవ్వవు. అందువల్ల అవి ముక్కలవ్వడానికి ఎక్కువ సేపు ఉడికించాల్సి ఉంటుంది. దాని వల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది. అందుకే పప్పును ఉడికించేటప్పుడు ముందుగా ఉప్పు వెయ్యరు. మొత్తం ఉడికిన తర్వాతే సరిపడా ఉప్పు వేసుకుంటారు.

No comments:
Post a Comment