Wednesday, February 14, 2024

How Birds migrate? పక్షులు ఎలా వలస వెళ్తాయి?

 


మీరు తరచుగా గమనించే ఉంటారు, ఆకాశంలో గుంపులుగా పక్షులు వెళ్లిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కొంగల లాంటివి V ఆకారంలో ఎగురుతూ వెళ్తుంటాయి. అవి చాలా దూరం నుంచి వస్తూ ఉంటాయి. అలాగే అవి చాలా దూర ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులు విదేశాల నుంచి వస్తుంటాయి. వీటిని మనం వలస పక్షులు అంటుంటాం. వీటిలో కొన్ని రష్యాలోని సైబీరియా నుంచి, మన దేశానికి వచ్చే పక్షులు కూడా కొన్ని ఉంటాయి. ఆ పక్షులు ఇండియాలో 3 నుంచి 4 నెలలు ఉంటాయి. తిరిగి తమ స్వదేశాలకు వెళ్లిపోతాయి. ఎక్కువగా చలికాలం వచ్చినప్పుడు ఈ పక్షులు భారత్ వస్తుంటాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఈ పక్షులకు దారి ఎలా తెలుసు? ఎలా అవి అత్యంత కచ్చితత్వంతో చేరాలనుకున్న చోటికి చేరుతున్నాయి? వేల కిలోమీటర్లు ఎగురుతూ వచ్చినా, అవి దారి తప్పకుండా ఎలా గమ్యానికి చేరగలుగుతున్నాయి?


భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వతాల వంటి వాటిని పక్షులు గుర్తు పెట్టుకుంటాయి. ఈ వలస పక్షుల తలలో మాగ్నటైట్‌ (Magnetite) అనే సూక్ష్మకణాలు ఉంటాయి. ఈ మాగ్నటైట్.. పేరుకు తగినట్లే, అయస్కాంతంలా పనిచేస్తుంది. అందువల్ల ఈ పక్షులు భూ అయస్కాంత క్షేత్రాన్ని కనిపెట్టగలవు. దానికి అనుగుణంగా అవి ఎగురుతూ వెళ్తాయి. అలా వెళ్తూనే పర్వతాలు, నదులు, సముద్రాలు, సూర్యుడు, నక్షత్రాలను గమనిస్తూ ఆ పక్షులు ముందుకెళ్తాయి. అయస్కాంత క్షేత్రంపై ఆధారపడతాయి కాబట్టే, ఈ పక్షులు ఏమాత్రం దారి తప్పవు. 


ఎలా ఎగురుతాయి?

ఎక్కువ దూరం వలస వెళ్లే పక్షులు అలసిపోకుండా వందల మైళ్లు ప్రయాణించేందుకు ఓ టెక్నిక్ ఉపయోగిస్తాయి. ఇలా ఎగిరే పక్షులు రివర్స్ V (^) ఆకారంలో ఎగురుతాయి. వీటిలో ముందు ఎగిరే పక్షులు గాలిని చీల్చుతూ, బలంగా ఎగరాల్సి వస్తుంది. తద్వారా అవి గాలి ఒత్తిడిని పక్కకు పంపిస్తాయి. దాంతో వెనక ఎగిరే పక్షులకు అంత ఒత్తిడి ఉండదు. అవి తేలిగ్గా ఎగరగలుగుతాయి. ఐతే.. ముందు ఎగిరే పక్షులు, కొంత దూరం వెళ్లాక.. పొజిషన్ మార్చుకొని వెనక్కి వస్తాయి. వెనక ఉన్న పక్షులు ముందుకు వెళ్తాయి. ఇలా ఈ పక్షులు, చక్కగా సహకరించుకుంటూ, గుంపుగా ఎగురుతాయి. ఐకమత్యమే మహా బలం అని చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...