Wednesday, February 14, 2024

Do Fish Sleep? - చేపలు నిద్రపోతాయా?

 


మీరు చేపల్ని ఎప్పుడైనా గమనించారా.. అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. రాత్రైనా, పగలైనా ఒక్క క్షణం కూడా అవి కదలకుండా ఉండవు. ఏవో కొన్ని చేపలు తప్పితే, మాగ్జిమం చేపలన్నీ కదులుతూనే ఉంటాయి. పైగా వాటి కళ్లకు రెప్పలు ఉండవు. అందువల్ల వాటిని ఆక్వేరియంలో చూసినప్పుడు, ఇవి నిద్రపోవా అనే డౌట్ మనకు వస్తుంది. దానికి ఆన్సర్ తెలుసుకుందాం.


సమాధానం తెలుసుకునేముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. నిద్రపోవాలంటే కళ్లకు రెప్పలు ఉండాలనీ, అవి మూతపడాలని రూలేమీ లేదు. ఈ సృష్టిలో అన్ని జీవులూ ఒకేలా ఉండవు. అలాగే వాటి జీవన శైలి కూడా ఒకేలా ఉండదు. ఉదాహరణకు సాలెపురుగుకి తలలోనే కాదు.. బాడీలో కూడా కళ్లుంటాయి. మొత్తం 8 కళ్లు ఉంటాయి. బల్లికి తన తోక కట్ అయినా ఏమీ కాదు. పిల్లి 20 అంతస్థుల పైనుంచి కింద పడినా ఏమీ కాదు. ఇలాగే చేపలు కూడా కనురెప్పలు లేకపోయినా, నిద్రపోగలవు.


చేపలు రోజూ ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే, మరికొన్ని రాత్రిపూట నిద్రిస్తాయి. మీరు దీన్ని చూడవచ్చు కూడా. ఇళ్లలోని ఆక్వేరియంలో చేపలు రాత్రివేళ పెద్దగా కదలికలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే అవి ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాయి. 


సముద్రాల్లో చేపలు నిద్రపోయే సమయం రాగానే, నీటిలోతుల్లో ఉండే గుహల్లోకీ, పగడపు దిబ్బల్లోకీ వెళ్తాయి. అక్కడి మట్టిని తమ ఒంటిపై వేసుకొని, నిద్రపోతాయి. దాంతో అక్కడో చేప ఉందనీ, నిద్రపోతోందనీ ఇతర జీవులకు తెలియదు. ఒకవేళ ఇతర జీవులు కనిపెట్టి.. పట్టుకుందామని వచ్చినా, చేపలు చూడగలవు. అవి నిద్రపోయినా, పూర్తిగా నిద్రపోవు. స్పృహలోనే ఉంటాయి. అందువల్ల చిన్న అలికిడి అయినా, ఇట్టే నిద్రలేస్తాయి. నిద్ర సమయంలో చేపలు చురుగ్గా ఉండవు. కానీ నిద్రలేవగానే ఫుల్ యాక్టివ్‌గా ఉంటాయి. నిద్రపోతూ కూడా చేపలు ఈదుతూనే ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...