Wednesday, February 14, 2024

Butterfly has no skeleton? - సీతాకోకచిలుకకి అస్థిపంజరం వుండదా?


 సీతాకోకచిలుక జీవితం ఆశ్చర్యకరం. గొంగళిపురుగు గూడు కట్టుకొని నిద్రపోవడం, ఆ తర్వాత దానికి రెక్కలు వచ్చి, సీతాకోకచిలుకగా మారడం అంతా ప్రకృతి చిత్రం. మనలో చాలా మంది గొంగళిపురుగును చూసి భయపడతారు. దూరంగా వెళ్లిపోతారు. కానీ సీతాకోకచిలుక మాత్రం అందరికీ నచ్చుతుంది. దాని కలర్స్, రెక్కలు ఆకట్టుకుంటాయి. ఐతే.. సీతాకోకచిలుకకు సంబంధించి మనం మరో ఆసక్తికర విషయం చెప్పుకోవచ్చు. అదేంటంటే, వాటికి అస్థిపంజరం ఉండదు.


ఎముకలు లేకుండా మనం ఉండగలమా? మనం ఏం చెయ్యాలన్నా ఎముకలు ఉండాల్సిందే. మన శరీరంలోని ప్రతీ పార్టుకీ ఎముకలు కీలకం. అలాంటిది సీతాకోకచిలుకకు ఎముకే ఉండదంటే నమ్మడం కష్టం. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది.


మనిషి చనిపోతే, ఎముకలు మిగులుతాయి. మిగతా శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. అదే సీతాకోక చిలుక విషయంలో రివర్స్. అవి చనిపోతే, వాటి బాడీ అలాగే ఉంటుంది. చనిపోయి ఉన్న సీతాకోక చిలుకను మీరు ఓ సీసాలో ఉంచితే, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. దాని బాడీ, రెక్కలు అలాగే ఉంటాయి. కారణం దాని అస్థిపంజరం ప్రత్యేకమైనది. దాన్ని అనెక్సోస్కెలెటన్ (anexoskeleton) అంటారు. ఇది బలమైన అస్థిపంజరం. అలాగని దీన్లో ఎముకలు మాత్రం ఉండవు. 


ఈ ప్రత్యేక అస్థిపంజరంతో సీతాకోక లాంటి జీవులు శ్వాసక్రియ, విసర్జన క్రియ జరిపేందుకు వీలుగా కన్నాలు ఉంటాయి. ఈ తరహా అస్థిపంజరం రొయ్యలు, పీతలకు కూడా ఉంటుంది. ఇకపై మీరు ఎప్పుడైనా సీతాకోకచిలుకను చూస్తే, ఈ విషయం గుర్తు చేసుకోండి. అప్పుడు మీ అబ్జర్వేషన్ మరింత నిశితంగా ఉంటుంది.


No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...