కొన్ని ప్రశ్నలు చాలా ఆసక్తి కలిగించడమే కాదు.. ఆలోచన కలిగిస్తాయి కూడా. ఇది అలాంటిదే. ఎందుకంటే, మన మొబైల్లో బ్యాటరీ 2 లేదా 3 రోజుల్లో అయిపోతుంది. మళ్లీ మనం ఛార్జ్ చేసుకుంటాం. అలాగే వాల్ క్లాక్‌లో బ్యాటరీ 1 సంవత్సరంలో అయిపోతుంది. బైక్‌లో బ్యాటరీ 3 ఏళ్లలో అయిపోతుంది. ఇలా ప్రతీ దానికీ ఎనర్జీ అయిపోయే టైమ్ ఉంటుంది. మరి భూమి సంగతేంటి? భూమిలో ఎనర్జీ ఎప్పుడు అయిపోతుంది? అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మన భూమిలోపల బొగ్గు, చమురు, పెట్రోలియం, గ్యాస్ వంటివి లభిస్తాయని మనకు తెలుసు. ఇవన్నీ భూమిలో ఎలా తయారవుతాయో తెలుసా? మొక్కలు, చెట్లు, చేపల వంటివి చనిపోయాక, వాటిపై ఇసుక పేరుకుపోయి వాటిని బలంగా నొక్కేస్తుంది. ఇలా కొన్ని వందల సంవత్సరాలు అయ్యేటప్పటికి, అవి శిలాజ ఇంధనాలు (fossil fuels)గా మారి, ప్రత్యేక పొరలా ఏర్పడతాయి. ఆ పొరను తవ్వి తీస్తారు. అదే చమురు, పెట్రోలియం రూపంలో వస్తుంది. దానితోనే దాదాపు 6000 రకాల ఉత్పత్తులను తయారుచేస్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు వంటివి అందులోంచీ వచ్చేవే. వాటి కోసం రోజూ కొత్త కొత్త ప్రదేశాల్లో తవ్వుతూ, నిల్వలు ఉన్నాయేమో అని చూస్తూనే ఉన్నాయి ప్రపంచదేశాలు.
గల్ఫ్ దేశాల్లో చమురు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందుకు కారణం మనం చెప్పుకున్నదే. ఇప్పుడు గల్ప్ దేశాలు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేది. దాంతో చాలా జీవులు, మొక్కల వంటివి సముద్రంలోని ఇసుకలో సమాధి అయ్యాయి. వాటిపై ఇసుక పేరుకుపోయింది. కాలక్రమంలో సముద్రం ఎండిపోయి, గల్ఫ్ దేశాలు ఎడారిలా మారాయి. ఇప్పుడు ఆ ఇసుకలో తవ్వితే, శిలాజ ఇంధనాలైన చమురు, గ్యాస్ వంటివి లభిస్తున్నాయి. మన కృష్ణా, గోదావరి బేసిన్‌లో కూడా ఇదే జరుగుతోంది.
భూమి లోపల నుంచి తవ్వితీస్తున్న శిలాజ ఇంధనాల స్థానంలో ఇసుకతో పూడ్చుతారు. ఇలా రోజూ ప్రపంచవ్యాప్తంగా వేల టన్నుల శిలాజ ఇంధనాలను తీస్తూనే ఉన్నారు. అందువల్ల కొన్నేళ్ల తర్వాత ఈ ఇంధనాలు అయిపోతాయనే అభిప్రాయం ఉంది. ఓ అంచనా ప్రకారం 2060 నాటికి ఇవి పూర్తిగా అయిపోతాయి. అప్పుడు మనకు పెట్రోల్, డీజిల్ ఉండకపోవచ్చు.
ఈ కారణంగానే ప్రపంచ దేశాలు ఇప్పుడు సోలార్, విండ్ ఎనర్జీపై ఫోకస్ పెట్టాయి. భవిష్యత్తులో భూమిలో ఎనర్జీ అయిపోతే, అప్పుడు సూర్యుడి ఎండని, సోలార్ పవర్ రూపంలో ఎక్కువగా వాడుకోక తప్పదు. ఇండియా, చైనా, అమెరికా సహా చాలా దేశాలు ఇప్పుడు దీనిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి.

No comments:
Post a Comment