Wednesday, February 14, 2024

Durien Fruit: పీల్చితే కంపు వాసన, తింటే రుచి అమోఘం. ఈ పండు తీరే వేరు!


మనం ఇండియాలో పనసపండ్లను ఆసక్తిగా తింటాం. వాటి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటిదే తూర్పు ఆసియా దేశాల్లో డ్యురియన్ అనే పండు ఉంటుంది. ఇది విపరీతమైన కంపు కొడుతుంది. ఆ వాసన మనం భరించలేం. అందుకే ఈ పండు తినాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ పండు రుచి బాగుంటుంది. ఈ పండ్లలో దాదాపు 30 రకాల జాతులున్నాయి. వాటిలో 9 రకాల జాతుల పండ్లను తినవచ్చు. ఇండొనేసియాలోని సుమత్రా దీవుల్లో ఈ పండ్లను మొదట కనుక్కున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఈ పండ్లు లభిస్తున్నాయి.


మన దగ్గర పండ్లలో రారాజుగా మామిడిని చెబుతాం. తూర్పు ఆసియా దేశాల్లో డ్యురియన్ పండ్లను రారాజుగా చెబుతారు. ఈ పండ్లు ఒక్కొక్కటీ దాదాపు 3 కేజీల బరువు పెరుగుతాయి. ఈ పండు, కుళ్లిపోయిన ఉల్లిపాయ వాసన వస్తుంది. అందువల్లే చాలా మంది కడుపులో తిప్పినట్లు ఫీలవుతారు. ఇంకా చిత్రమేంటంటే.. మీరు ఈ పండును ఇంటికి తెచ్చి, తిరిగి ఎక్కడికైనా పట్టుకెళ్లినా, మీ ఇంట్లో ఈ పండు వాసన కొన్ని రోజులపాటూ ఉంటుంది. అందుకే ఈ పండును హోటళ్లు, ప్రజా రవాణా వాహనాల్లో తీసుకెళ్లనివ్వరు. ఈ పండును తీపి పదార్థాల్లో వాడతారు. లోపలి గింజలను కూడా ఉడకబెట్టి తింటారు. 


రుచి ఎలా ఉంటుంది?

ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. తీపి రుచి ఉంటుంది. మెత్తమెత్తగా సీతాఫలం తరహాలో ఉంటుంది. కారామెల్, వెనీలా, చీజ్ కేక్ రుచి కలిగివుంటుంది. 


ధర ఎంత?

ఇప్పుడు డ్యురియన్ పండ్లను ఇండియాలో కూడా సాగు చేస్తున్నారు. మీరు వీటిని ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కొనవచ్చు. ఒక పండు ధర రూ.200 దాకా ఉంటుంది.


No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...