ఈ రోజుల్లో చిన్న అనారోగ్యం వచ్చినా మందులు వాడటం మనకు అలవాటైపోతోంది. తలనొప్పి, కడుపునొప్పి, జలుబు, గొంతునొప్పి ఇలా ఏది వచ్చినా, ఇంట్లో వాళ్లు టాబ్లెట్ వేసుకో అని ఎంకరేజ్ చెయ్యడం, సరేలే అని మనం వేసేసుకోవడం కామనైపోతోంది. ఒంట్లో బాలేదని ఎవరికైనా చెప్పగానే.. టాబ్లెట్స్ వేసుకో అనో డాక్టర్ దగ్గరకు వెళ్లు అనో చెప్పేస్తున్నారు. మంచి సలహా ఇచ్చామని వారు అనుకుంటున్నారు. మరి ఇది మంచిదేనా? ప్రతిదానికీ మాత్రలు వాడేయొచ్చా? ముఖ్యంగా విటమిన్ టాబ్లెట్స్ వాడటం ఆరోగ్యానికి మేలేనా?
రూల్ ప్రకారం మనం ఏ మందులు వాడాలన్నా, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉండి తీరాలి. కానీ మన దేశంలో చట్టాలు పూర్తిగా అమలుకావు. అందువల్ల ప్రజలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమకు ఏ టాబ్లెట్లు కావాలో వారు డిసైడ్ చేసుకుంటారు. అలాగే మందుల షాపుల్లో కూడా, ఏ నొప్పికి మందు అడిగినా, వెంటనే ఇచ్చేస్తారు. ఇదంతా రొటీన్‌గా జరుగుతున్నదే. ఇక విటమిన్ టాబ్లె్ట్ల పరిస్థితి వేరు. వాటిలో చాలా కంపెనీలున్నాయి. వాటి గురించి మనకు ఏమీ తెలియకపోయినా, మందుల షాపులో వాళ్లు ఇస్తే, మనం వాడతాం. అవి మంచివా, కావా అన్నది ఆలోచించేంత టైమ్ మన దగ్గర ఉండదు. షాపుల వాళ్లు అవి మంచివని చెబితే, నమ్ముతాం.
సాధారణంగా విటమిన్ టాబ్లెట్లు రకరకాల రూపాల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అన్ని రకాల విటమిన్లూ అవసరం లేదు. వారికి కొరత ఉన్న విటమిన్లు మాత్రమే వారు మాత్రల రూపంలో పొందడం మేలు. కానీ విటమిన్ మాత్రల్లో, చాలా రకాల విటమిన్లు కలిసి ఉంటాయి. అందువల్ల ఈ మాత్రలతో అవసరమైన విటమిన్లతోపాటూ, అవసరం లేని విటమిన్లు అధికంగా పొందే ప్రమాదం ఉంటుంది.
పిల్లలు, గర్భిణీలు, ముసలివారు, కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు.. విటమిన్ మాత్రలు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే, వారికి కొన్ని విటమిన్లు సమస్యగా మారగలవు. డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు మాత్రమే వాడాలి. మందుల షాపుల వాళ్లను కూడా ఆ టాబ్లెట్లే ఇవ్వమని అడగాలి. వేరేవి ఇస్తే, తీసుకోకూడదు.
సహజంగానే విటమిన్లు:
అన్నింటికంటే ఉత్తమ విధానం విటమిన్ల కోసం సహజ పద్ధతులను అనుసరించడం. ఉదయం, సాయంత్రం వేళ ఎండలో అరగంట చొప్పున ఉంటే, D విటమిన్ లభిస్తుంది. ఆకుకూరల్లో A, B, E, K విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. పండ్లలో C విటమిన్ బాగా లభిస్తుంది. కాబట్టి ప్రతీ వారం అన్ని రకాలూ కలగలిసిన ఆహారం తినాలి.
ఇలా తింటే మేలు:
మాంసాహారులు వారానికి 2 సార్లు మాంసం, 2సార్లు గుడ్లు తినవచ్చు. అలాగే పప్పులు, కూరగాయలు, ఆకుకూరలూ తప్పనిసరిగా తినాలి. ఇంకా పండ్లు, డ్రై ఫ్రూట్స్, గింజల వంటివి కూడా తప్పక తీసుకోవాలి.
శాఖాహారులు వారానికి 3సార్లు కందిపప్పు తీసుకోవాలి. తద్వారా వారికి ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే పండ్లలు, కూరగాయలు, పప్పులు, బద్దలు, గింజలు, డ్రైఫ్రూట్స్, తృణ ధాన్యాల వంటివి అన్నీ క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఆహారంతోపాటూ, రెగ్యులర్‌గా వాకింగ్, జాగింగ్ వంటివి లేదా ఇంటి పనుల వంటివి చేస్తూ ఉంటే, బాడీలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

No comments:
Post a Comment