మనం ఓ బొంగరాన్ని తిప్పితే, అది ఒక నిమిషం తిరిగి, ఆగిపోయి, పడిపోతుంది. ఆ నిమిషం పాటూ తిరగడానికి కారణం దాన్ని మనం బలంగా తిప్పడం ద్వారా దానికి లభించిన ఎనర్జీయే. ఒక తిరుగుతున్న ఫ్యాన్‌ని మనం స్విచ్ ఆఫ్ చేస్తే, 2 నిమిషాల్లో అది ఆగిపోతుంది. కారణం.. అప్పటివరకూ దానికి లభించిన ఎనర్జీ, స్విచ్ ఆఫ్ చెయ్యగానే ఆగిపోవడం వల్లే. మరి సూర్యుడి చుట్టూ భూమి ఏ ఎనర్జీతో తిరుగుతోంది? దానికి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తోంది. మరో ప్రశ్న కూడా ఉంటుంది. భూమి నిరంతరం ఒకే వేగంతో తిరుగుతోంది. ఇదెలా జరుగుతోంది? భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? తెలుసుకుందాం.
సూర్యుడి చుట్టూ భూమి, ఇతర గ్రహాలూ తిరగడానికి కారణం సూర్యుడు వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ శక్తి. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సూత్రం (Newton Gravitational Law) ప్రకారం విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశులపై, వాటి మధ్య ఉండేదూరంపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వస్తువు, తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఆకర్షిస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కువ బరువు ఉన్న వస్తువు, తక్కువ బరువు ఉన్న వస్తువును తనవైపు ఆకర్షిస్తుంది. వస్తువుల మధ్య దూరం ఎక్కువయ్యేకొద్దీ ఆకర్షక బలం తగ్గుతుంది.
సూర్యుని ద్రవ్యరాశితో పోలిస్తే, గ్రహాల ద్రవ్యరాశి చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడు 99.8 శాతం ద్రవ్యరాశి (mass) కలిగివుంది. మిగతా 0.2 శాతం మాత్రమే ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు వంటివి ఉన్నాయి. అందువల్ల సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఈ గ్రహాలను బలంగా తనవైపు లాగుతూ ఉంటుంది కాబట్టే, అవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
మనం ఓ బంతిని నేలపై జారవిడిస్తే, అది భూమి తరహాలోనే తనచుట్టూ తాను తిరుగుతూ.. కొంత దూరం వెళ్తుంది. ఇదే విధంగా భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో తన చుట్టూ తాను తిరుగుతున్నట్లుగా దొర్లుతోంది అనుకోవచ్చు. మరైతే సూర్యుడు దాన్ని పూర్తిగా లాగేసుకోవచ్చు కదా.. ఎందుకు అలా జరగట్లేదు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి మరో కారణం ఉంది. ఏదైనా వస్తువు నిర్ధిష్ట వేగం కంటే ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంటే, దాన్ని గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా లాగేసుకోలేదు. భూమి సెకండ్‌కి 30కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. కాబట్టి భూమిని సూర్యుడు లాక్కోలేకపోతున్నాడు.
ఇదే లెక్క భూమికి చూస్తే, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకోవాలంటే.. ఆ వస్తువు సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరగాలి. భూమిపై ఉన్న మనం.. భూమి ఆకర్షణను తప్పించుకొని విశ్వంలోకి వెళ్లిపోవాలంటే మనం సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లాలి. లేదంటే, వేగం తగ్గితే, భూమి మనల్ని తిరిగి లాగేయగలదు. భూమి చుట్టూ తిరిగే చందమామను భూమి లాక్కోలేకపోతోంది. కారణం చందమామ అతి వేగంతో తిరుగుతుండటమే. చందమామ సెకండ్‌కి 1 కిలోమీటర్ వేగంతో తిరుగుతోంది. ఐతే.. చందమామ భూమికి చాలా దూరంగా ఉండటం వల్ల.. ఆ వేగంతో తిరుగుతున్నా, దాన్ని భూమి లాక్కోలేకపోతోంది.
మీకు మరో డౌట్ రావచ్చు.. నేలపై బంతి దొర్లుతూ వెళ్తుంది. కానీ భూమి విశ్వంలో తేలుతున్నట్లుగా ఉంది కదా. మరి అది ఎందుకు దొర్లుతోంది? దేనిపై దొర్లుతోంది అనే ప్రశ్నలు రావచ్చు. దీనికి ఐన్‌స్టైన్ సాపేక్షతా సిద్ధాంతం (Theory of Relativity)లో కొంత సమాధానం ఉంది. దీని ప్రకారం.. ఈ విశ్వంలో మనకు తెలియకుండా ఓ రకమైన వల లాంటిది ఉంది. అది మన కంటికి కనిపించట్లేదు. అది మన స్ఫర్శకు రావట్లేదు. ఈ గ్రహాలన్నీ ఆ వలలోనే ఉంటూ, తిరుగుతున్నాయన్నది ఈ సిద్ధాంతం చెబుతున్న మాట. ఈ వల కారణంగానే గ్రహాలు.. దొర్లుతున్నట్లుగా కాస్త పక్కకు వంగి తిరుగుతున్నాయని అంటున్నారు. ఐతే.. ఇదే వల గ్రహశకలాలు (Asteroids), తోక చుక్కలు, ఉల్కలకి ఎందుకు వర్తించట్లేదు? అవి ఇష్టమొచ్చినట్లు ఎందుకు తిరుగుతున్నాయి అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది.
భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎలాంటి శక్తినీ విడుదల చెయ్యట్లేదు. అందువల్ల భూమి బరువు తగ్గట్లేదు. అందువల్లే భూమి ఎప్పుడూ ఒకే వేగంతో తిరుగుతోంది. భూమి ఇలా తిరగడం ఆగిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే, దాన్ని ఆపేందుకు ఏ శక్తీ ప్రయత్నించట్లేదు.
సూర్యుడిలో మాత్రం ఎనర్జీ నానాటికీ తగ్గుతోంది. అంటే సూర్యుడు బరువు తగ్గుతున్నట్లే. సూర్యుడు ప్రతి సెకండ్‌కీ 50 లక్షల టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. అయినా ఇది సూర్యుడి బరువుతో పోల్చితే 0.01 శాతం మాత్రమే. అందువల్ల సూర్యుడి బరువు ఇప్పట్లో చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గదు. అందుకే, భూమి తిరిగే వేగంలో మార్పు ఉండట్లేదు. అందువల్ల సూర్యుడి నుంచి భూమి ఇప్పట్లో తప్పించుకునే ఛాన్స్ లేదు. అందువల్ల అది తిరుగుతూనే ఉంటుంది.
500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడి లోపలి హైడ్రోజన్ పూర్తిగా అయిపోతుంది. దాంతో సూర్యుడిలోని ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. సూర్యుడు విచ్చుకునే పువ్వులా.. పరిమాణం పెరిగిపోతుంది. దాంతో తనకు దగ్గర్లోని బుధ, శుక్ర గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతాయి. ఆ సమయంలో సూర్యుడు ఇప్పటికన్నా 2300 రెట్లు అధికంగా ప్రకాశిస్తాడు. దాంతో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి, జీవులన్నీ చనిపోతాయి. చివరకు భూమి కుతకుతా ఉడుకుతూ, లావా సముద్రంలాగా మారిపోతుందని శాస్త్రవేత్తల అంచనా.
ఇంకా ఈ విషయంలో మనకు చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా ఉంటాయి. ఇదో పెద్ద సబ్జెక్ట్. దీని గురించి కొన్ని సంవత్సరాలపాటూ చర్చించుకోవచ్చు. అయినా చాలా ప్రశ్నలు, మిస్టరీగానే ఉంటాయి.

No comments:
Post a Comment