సముద్రం మనందరికీ నచ్చుతుంది. ఎంతో విశాలంగా ఉంటుంది. ఆకాశం-నేల కలిసినట్లుగా కనిపిస్తుంది. కంటిన్యూగా అలలు వస్తూనే ఉంటాయి. చల్లని గాలి మనసును తాకుతుంది. ఇక ఆల్చిప్పలు, గులకరాళ్లూ రకరకాల ఆకారాలు, రంగులతో ఆకట్టుకుంటాయి. అదో అద్భుతమైన ప్రపంచం. అందుకే సముద్రం దగ్గరకు వెళ్లగానే మనమంతా చిన్న పిల్లలం అయిపోతాం. జలకాలాటలాడుతూ.. ఈ లోకాన్ని మర్చిపోతాం. అంతా బాగానే ఉన్నా, నదుల్లో లాగా.. సముద్ర నీరు తాగలేం. అవి ఉప్పగా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.
నిజానికి సముద్ర నీరు ఒకప్పుడు మంచినీరే. అప్పట్లో అందులో ఉప్పు ఉండేది కాదు. ఐతే.. భూమి నుంచి లవణాలతో కూడిన మంచి నీరు అంటే.. Ph 7.0 కంటే తక్కువ ఉండే నీరు, నదుల ద్వారా సముద్రంలో కలుస్తుంది. రోజూ ఈ నీరు ఆవిరి అవుతూనే ఉంటుంది. అందుకే సముద్రాలపై ఎక్కువగా మేఘాలు ఉంటాయి. తరచూ సముద్రాలపై అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వస్తుంటే వాటి ద్వారా, భారీగా మేఘాలు భూమివైపు వస్తాయి. అవి భూమిపై వర్షాలు కురిపిస్తాయి. ఆ వర్షాల ద్వారా మళ్లీ నీరు నదుల్లోకి చేరి, అక్కడి నుంచి సముద్రాల్లో కలుస్తుంది. ఇలా రోజూ అన్ని సముద్రాల్లోకీ ఉప్పు చేరుతూనే ఉంటుంది. ఐతే.. ఈ ఉప్పు మేఘాలతో పైకి వెళ్లదు. ఇది సముద్రంలోనే ఉంటుంది. అందుకే సముద్రాలు నానాటికీ మరింత ఉప్పగా అవుతున్నాయి.
కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉప్పు చేరడంతో సముద్రాలు ఇప్పుడు చాలా ఉప్పగా ఉంటున్నాయి. సముద్రంలో Ph 7.0 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది 1 లీటర్ నీటిలో 35 గ్రాములు ఉంటుంది. సపోజ్ మీరు మార్కెట్‌లో కేజీ ఉప్పు కొంటే, దాని అర్థం మీకు ఆ ఉప్పు.. 30 లీటర్ల నీటిని ఆవిరి చెయ్యగా వచ్చిందని అర్థం.
నదుల్లో ఇలా ఎందుకు జరగదు?
నదుల నీటిలో కూడా ఉప్పు ఉంటుంది. అది చాలా తక్కువగా ఉంటుంది. భూమి పొరల్లోని ఉప్పు.. నదుల ద్వారానే సముద్రంలో కలుస్తుంది. నదులు ఈ ఉప్పును తమలో ఉంచుకోవు. అవి నిరంతరం ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి కాబట్టి.. ఉప్పు రేణువులు కూడా నదుల నీటితో వెళ్లిపోతూ, సముద్రంలో చేరతాయి. ఆ తర్వాత అవి ఎక్కడికీ వెళ్లవు. అక్కడే ఉండిపోతాయి. అలా లక్షల సంవత్సరాలుగా ఉప్పు పెరుగుతూనే ఉంటుంది.
Dead Sea (మృత సముద్రం):
పశ్చిమ ఆసియా లోని ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్ బ్యాంక్ దగ్గర మీరు డెడ్ సీని చూడవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఇది కనిపిస్తుంది. ఇక్కడ సముద్రాల్లో కంటే 10 రెట్లు ఎక్కువగా ఉప్పు ఉంది. అందువల్ల ఇందులో మనిషి తేలగలరు. ఈ మృత సముద్రంలో చేపలేవీ బతకవు. ఈ సముద్రంలో బ్యాక్టీరియా తప్ప మరేదీ బతకట్లేదు.

No comments:
Post a Comment